- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నియోజకవర్గంపై పట్టు లేని నాయకుల మాటలు నమ్మొద్దు
దిశ, చైతన్య పురి : నియోజకవర్గంపై పట్టు, అవగాహన లేని నాయకుల మాయ మాటలు నమ్మొద్దని ఎల్బీనగర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. కొత్తగా వచ్చే నాయకుల మాయమాటలు నమ్మకుండా ప్రజాసేవలో పాలు పంచుకునే తనకు ఓటేసి మరోసారి ఆశీర్వదించాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా హయత్ నగర్ డివిజన్ లోని హుడాసాయినగర్ కాలనీ నుండి భాగ్యాలత వరకు దాదాపు 20 కాలనీలలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ తన ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా బస్తీవాసులు అడుగడుగునా మంగళహారతులు, డప్పులతో స్వాగతం పలికారు. రాబోయే ఎన్నికల్లో సుధీర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ప్రధాన సమస్యలు పరిష్కరించామని, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని కూడా దశలవారీగా పరిష్కారం చేస్తామని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత బాధ్యతతో పార్టీని బలోపేతం చేసి ముందుకు పోతామని తెలిపారు. నిజామాబాద్ లో చెల్లని రూపాయి హైదరాబాదులో చెల్లుతుందా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే గొనే ప్రకాష్ రావు మధుయాష్కీ మీద గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారని, దొంగ వీసాలు, నకిలీ డ్యాక్యుమెంట్లు సృష్టించి ఎంతో మందిని మోసం చేస్తే వారి మీద పోలీస్ స్టేషన్లో 420 కేసులు కూడా నమోదు కావడం జరిగిందని వారే స్వయంగా ఒప్పుకోవడం జరిగిందన్నారు. దానికి సంబంధించిన సాక్ష్యాలు యూట్యూబ్ లో ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు ఇలాంటి వారు వచ్చి తాము అభివృద్ధి చేస్తామని
అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బలమైన క్యాడర్ లేకపోయినా అత్యాశతో పోటీ చేస్తున్నాడని విమర్శించారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సామ రంగారెడ్డి సొంత బంధువుల పొలాలు కబ్జా పెట్టడం వల్ల వారి బంధువులే అతని మీద దాడి చేయడం నిజంకాదా అని ప్రశ్నించారు. ఇంట్లో వారే ఆయనకు ఓట్లు వేయరు మరి ప్రజలు ఎలా వేస్తారన్నారు. దొంగలకు, కబ్జాకోరులకు నియోజకవర్గంలో స్థానం లేదన్నారు. గత ఐదు సంవత్సరాలుగా తాను చేసిన అభివృద్ధి పనులు గెలిపిస్తాయని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి, భాస్కర్ సాగర్, గుడాల మల్లేష్, గుత్తా లక్ష్మణ్ రెడ్డి, శ్రావణ్, అంజలి, గుజ్జ జగన్మోహన్, శ్రీకాంత్, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.