సీపీ ఆర్ తో ఆగిన గుండెకు ఊపిరి.. పోలీస్ లకు సీపీ ఆర్ ఫై శిక్షణ తరగతులు

by Kalyani |
సీపీ ఆర్ తో ఆగిన గుండెకు ఊపిరి.. పోలీస్ లకు సీపీ ఆర్ ఫై శిక్షణ తరగతులు
X

దిశ, సిటీక్రైం : హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో 16 వేల మంది పోలీస్ సిబ్బందికి ( సీపీ ఆర్) శ్వాస కోశ పునరుజ్జీవన చర్యకు సంబంధించిన శిక్షణను ఇస్తామని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. గురువారం హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో మైత్రి ఆసుపత్రి వారితో పోలీస్ లకు సీపీ ఆర్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సీపీ ఆర్ ఫై అవగాహన లేక ప్రతి రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.15 లక్షల మంది మరణిస్తున్నారని వివరించారు. సీపీ ఆర్ చర్య వల్ల కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు గుండె నుంచి ఆక్సిజన్ తో కూడిన రక్త సరఫరాను మెదడుతో సహా అన్ని అవయవాలకు వెళ్లేలా చేస్తుందన్నారు. మనిషి మూర్చాపోయిన సమయంలో సీపీ ఆర్ ఆలస్యం అయితే మెదడుకు కోలుకోలేని నష్టం కలుగుతుందని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఈ సీపీ ఆర్ శిక్షణ తో పోలీస్ కుటుంబాల తో పాటు సామాన్యులకు కూడా ఉపయోగకరమైందన్నారు. 15 బ్యాచ్ లుగా పోలీస్ సిబ్బంది, అధికారులందరికీ ఈ సీపీ ఆర్ ఫై 90 నిమిషాల పాటు శిక్షణ ఉంటుందని సీపీ చెప్పారు. ఈ కార్యక్రమం లో కార్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ రక్షిత మూర్తి, సీటీసీ ప్రిన్సిపల్ అనూప్ జై కుమార్, మైత్రి ఆసుపత్రి డాక్టర్ లు మహమ్మద్ ముబీన్ హుస్సేన్, మహమ్మద్ సాదిక్ అజమ్, ఫైసల్ అహ్మద్, జోహా, నజీరుద్దీన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed