- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
మేయర్ మీటింగ్‌కు కాంగ్రెస్ కార్పొరేటర్ల డుమ్మా
![మేయర్ మీటింగ్‌కు కాంగ్రెస్ కార్పొరేటర్ల డుమ్మా మేయర్ మీటింగ్‌కు కాంగ్రెస్ కార్పొరేటర్ల డుమ్మా](https://www.dishadaily.com/h-upload/2025/01/29/415931-ghmc.webp)
దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు బిగ్ షాక్ ఇచ్చారు. ఈనెల 30న నిర్వహించనున్న జనరల్ బాడీ సమావేశంలో వ్యవహరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడల నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లతో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో మంగళవారం సమావేశం నిర్వహించారు. మొత్తం 24 మంది కార్పొరేటర్లకు గాను ఏడుగురు మాత్రమే హాజరయ్యారు. మేయర్, డిప్యూటీ మేయర్ కాకుండా ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, సుజాతనాయక్, సీఎన్.రెడ్డి, మహాలక్ష్మి వచ్చారు. కార్పొరేటర్లందరికి నిధులు కేటాయించాలని అడగకుండా.. స్టాండింగ్ కమిటీ సభ్యులకే నిధులు కేటాయించాలని కోరడమేంటని పలువురు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు చర్చించుకుంటున్నట్టు తెలిసింది. మేయర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశంలో తాడోపేడో తేల్చుకోవాలని సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన సమావేశానికి అధికార పార్టీ సభ్యులే హాజరుకాకపోవడంతో మేయర్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
అందుకేనేమో..
మేయర్ విజయలక్ష్మిపై సొంత పార్టీ కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అందుకు కారణమూ లేకపోలేదు. ఈనెల 23న జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిధుల కేటాయింపు గురించి చర్చలేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే తమకు ఇంకా ఏడాదిపాటు సమయంలో ఉండడంతో ఒక్కొక్కరికి రూ.25కోట్ల చొప్పున నిధులు కేటాయించాలని కమిషన్ ఇలంబర్తిని స్టాండింగ్ కమిటీ సభ్యులు కోరారు. అందుకు రూ.25 కోట్లు ఇవ్వడం కుదరదు కానీ.. రూ.10 కోట్ల వరకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని కమిషనర్ చెప్పినట్టు తెలిసింది. ఈ విషయాన్ని పలువురు స్టాండింగ్ కమిటీ సభ్యులు సైతం అంగీకరించారు. కానీ స్టాండింగ్ కమిటీలో బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. దీంతో కాంగ్రెస్ కార్పొరేటర్లు మండిపడుతున్నారు. ఒక వేళ ఫండ్స్ ఇస్తే కార్పొరేటర్లందరికి ఇవ్వాలి తప్ప స్టాండింగ్ కమిటీ సభ్యులకే ఇవ్వడమేంటి? ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై అన్ని పార్టీలకు చెందిన కార్పొరేటర్లు మేయర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
30న కౌన్సిల్ సమావేశం..
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఈనెల 30న నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన కార్పొరేటర్లు తమ డివిజన్లతో పాటు నగరవ్యాప్తంగా ప్రధాన అంశాలకు సమాధానాలు కోరుతూ 139 ప్రశ్నలు పంపించారు. కానీ మేయర్ కార్యాలయం మాత్రం 21 ప్రశ్నలను మాత్రమే ఎంపిక చేసింది. వీటితో బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదనే ప్రచారం జరుగుతున్నది. అయితే తమ పార్టీ కార్పొరేటర్ల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే కౌన్సిల్ సమావేశం జరుగుతదా? అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో బీజేపీ కార్పొరేటర్లు తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అదేం లేదు
కార్పొరేటర్ల సమావేశం గురించి జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డిని ఫోన్‌లో సంప్రదించగా సమావేశం జరగలేదని అన్నారు. మేయర్‌ను కలవడానికి వచ్చామని చెప్పారు.:- ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్