బేగంపేట్ ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

by Shiva |
బేగంపేట్ ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని బేగంపేట్‌ ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం బేగంపేట్ ఫ్లై ఓవర్‌పై హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి పంజాగుట్ట వెళ్తున్న ఓ కారు అతివేగంతో ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్‌‌‌కు ఇబ్బంది కలుగకుండా పల్టీలు కొట్టిన కారును ట్రాఫిక్ పోలీసులు అక్కడి నుంచి మరోచోటికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story