- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ జీవో వద్దు.. విద్యార్థులకు నష్టం: గెల్లు శ్రీనివాస్
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ స్థానికత (Telangana Local)కోసం వైద్య విద్యలో జీవో నెంబర్ 33ను ఉపసంహరించి ఎంబీబీఎస్ సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించాలని BRSV రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్ (BRSV State Chief Gellu Srinivas Yadav) డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan) నుంచి మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరిన బీఆర్ఎస్వీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. ప్రభుత్వం ఉదాసీనత వల్ల ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డ్రీమ్డ్ యూనివర్సిటీ హోదాకు దరఖాస్తు చేసుకున్నాయని, తద్వారా 50 శాతం కన్వీనర్ కోట సీట్లు పొందగాలియని చెప్పారు. ఇలా హోదా పొందడం వల్ల తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆరోపించారు. ప్రతిభ కలిగిన పేద, మధ్యతరగతి విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ కుట్రలో భాగంగానే జీవో నెంబర్ 33ను కొనసాగించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టును ఆశ్రయించిందని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేందుకు దాఖలు చేసిన పిటిషన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని గెల్లు శ్రీనివాస్ డిమాండ్ చేశారు.