హైదరాబాద్‌లో అతి తక్కువ ధరకే బ్రాండెడ్ దుస్తులు.. ఎక్కడంటే..?

by Satheesh |
హైదరాబాద్‌లో అతి తక్కువ ధరకే బ్రాండెడ్ దుస్తులు.. ఎక్కడంటే..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: షాపింగ్ ప్రియులకు ఆఫర్లు ఉన్నాయని తెలిస్తే చాలు క్షణాల్లో ఆ ప్రదేశంలో వాలిపోతుంటారు. తాజాగా హైదరాబాద్‌లో అతితక్కువ ధరకే బ్రాండెడ్ దుస్తులు విక్రయిస్తున్నట్లు ప్రకటించారు. ఇంకేముంది.. జనాలు ఎగబడి మరి కొంటున్నారు. నిజాంపేట్‌ కొలన్‌ నారాయణ రెడ్డి గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్లో లగ్జరీ బ్రాండెడ్‌ దుస్తులను భారీ తగ్గింపు ధరకు విక్రయిస్తున్నామని నిర్వాహకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

పురుషులు, మహిళలు, పిల్లలతో సహా అనేక రకాల దుస్తులు లభిస్తాయన్నారు. దుస్తులను కుట్టు కూలీ ధరకే విక్రయిస్తున్నామన్నారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు నాలుగు రోజులు అమ్మకాలు ఉంటాయన్నారు. అయితే, ప్రకటన విడుదల చేశారో లేదో నారాయణ గార్డెన్‌కు జనాలు ఎగబడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed