- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి

దిశ, చందానగర్ : శేరిలింగంపల్లి నియోజక వర్గంలో చేసిన అభివృద్ధి పనులను చూసి మరోమారు గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి అరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం నియోజక వర్గంలోని గచ్చిబౌలి, హఫీజ్ పేట్, ఆల్విన్ కాలనీలలో సుడిగాలి పర్యటన చేసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ మాట్లాడుతూ..
శేరిలింగంపల్లి నియోజకవర్గం ను ఎంతగానో అభివృద్ధి చేశామని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని, మంచి పనులు ఎన్నో చేశామని, నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ లో జరిగిన గ్యార్వి షరీఫ్ ముబారక్ ఉత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి పాల్గొన్నారు. ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల చెరువు కట్టపై ఏర్పాటు చేసిన ఛట్ పూజా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు..
బీఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు..
హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్ కాలనీకి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు యువకులు 100 మందికి విప్ అరెక పూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్, దాత్రి గౌడ్, వేణు ,శ్రీనివాస్ పాల్గొన్నారు.