- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ముఖ్యమంత్రి యశోదా ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలి'
దిశ, శేరిలింగంపల్లి: బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించిన తీరుపై బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ ప్రవేశ పెట్టింది ఒక మహిళ అని కూడా చూడకుండా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఏకవచనంతో సంబోధించడం సిగ్గుచేటన్నారు. బడ్జెట్‌ను దేశంలో ఆర్థిక మేధావులు హర్షిస్తుంటే కేసీఆర్ అవహేళన చేయడం సరికాదని హితవు పలికారు. మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదని, ముఖ్యమంత్రిని అని అన్నారు. అదే విషయాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, త్వరలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రపంచ దేశాలు ప్రధాని మోడీ గొప్పతనాన్ని మెచ్చుకుంటుంటే, దేశంలో ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి పత్రికా సమావేశంలో మాట్లాడిన బాగోలేదని మండిపడ్డారు. పరిస్థితి చూస్తుంటే కేసీఆర్‌కు మతిభ్రమించినట్లు ఉందని, వెంటనే స్థానిక యశోద ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవాలని సూచించారు. రాజ్యాంగం నచ్చకపోతే దేశం వదిలి వెళ్లిపోవాలని, దళిత సమాజానికి, యావత్ భారతదేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మేడ్చల్-మల్కాజిగిరి అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ దేవ్, డివిజన్ దళిత మోర్చా అధ్యక్షులు నర్సింగ్, బీజేవైఎం డివిజన్ ప్రధాన కార్యదర్శి నర్సింగ్ రాజు తదితరులు పాల్గొన్నారు.