పుట్టినరోజు వేడుకల పేరుతో వృద్ధురాలి పై దాడి.. బంగారు ఆభరణాల అపహరణ

by Jakkula Mamatha |
పుట్టినరోజు వేడుకల పేరుతో వృద్ధురాలి పై దాడి.. బంగారు ఆభరణాల అపహరణ
X

దిశ, శామీర్‌పేట్ :పుట్టినరోజు వేడుకల పేరుతో వృద్ధురాలిపై దాడి చేసిన దుండగులు బంగారు, వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. ఈ సంఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడుచింతలపల్లి మండలం జగ్గంగూడ గ్రామానికి చెందిన చెవ్వా రాములమ్మను గత రెండు రోజుల క్రితం ఇంటి పక్కకు కిరాయికి వచ్చిన జంట పుట్టినరోజు వేడుకల పేరుతో సోమవారం సాయంత్రం ఇంటికి పిలిచారు. మద్యం మత్తులో రాములమ్మను దించి ఆపై దాడికి పాల్పడ్డారు. సుమారు 7 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలతో పరారి అయినట్లు సమాచారం. దాడిలో గాయపడిన మహిళను ఆర్‌వీఎం హాస్పిటల్ కి తరలించినట్టు సమాచారం.

Next Story

Most Viewed