- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్ట్..
దిశ, మియాపూర్: రోడ్ల వెంట ఒంటరిగా వెళ్తున్న మహిళలే టార్గెట్ గా చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను మాదాపూర్, మియాపూర్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వివరాలను మియాపూర్ పీఎస్ లో శనివారం ఏసీపీ నర్సింహారావు వెల్లడించారు. మియాపూర్ కృషినగర్ కు చెందిన జ్యోతి ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం స్కూల్ నుంచి తన కొడుకును ఇంటికి తీసుకువస్తున్న క్రమంలో ఆమె మెడలో నుంచి పుస్తెలతాడు అపహరించుకొని పరారయ్యారు. జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్, మియాపూర్ పోలీసుల అధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వేనువంక సురేష్(23), వడ్లూరి నికిత్ (21) లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నారు.
వారివద్ద నుంచి బంగారు పుస్తెలతాడు సుమారు 40 గ్రాములు, పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇరువురు వరంగల్ జిల్లా కు చెందినవారు. బతుకుదెరువు కోసం 8 నెలల క్రితం నగరానికి వచ్చి న్యూహాఫిజ్ పేట్ లో నివాసం ఉంటూ ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కాగా వచ్చే వీరి జల్సా, దురలవాట్లకు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో దొంగతనాల బాట పట్టినట్లు ఏసీపీ వివరించారు. కార్యక్రమంలో సీఐ తిరుపతిరావు, డీఐ కాంతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.