Hydra: అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా.. ఐలాపూర్ తండాలో కూల్చివేతలు

by Mahesh |   ( Updated:2024-09-03 07:29:31.0  )
Hydra: అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా.. ఐలాపూర్ తండాలో కూల్చివేతలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన హైడ్రా పెను సంచలనంగా మారింది. జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా.. చెరువులు, కుంటలు, నాలాల సంరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో అక్రమ కట్టడం ఎవరిది అయినా.. నేలమట్టం చేసేవరకు ఉపేక్షించడం లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాకు మద్దతు పెరగడమే కాకుండా.. తమ జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్‌లు వస్తున్నాయి.ఇదిలా ఉంటే ఓ వైపు రాష్ట్రంలో వరదలు దంచికొడుతుంటే.. మరోపక్క హైడ్రా అధికారులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు.

ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టిన సోసైటీలు, కాలనీలకు నోటీసులు జారీ చేస్తుంది. ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లాలో అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా ఝులిపించింది. అమీన్‌పూర్‌ (మం)ఐలాపూర్ తండాలో దాదాపు 20 ఎకరాల ఆక్రమిత భూమిని అధికారులు రక్షించే పనిలో హైడ్రా అధికారులు నిమగ్నమయ్యారు. సర్వేనెంబర్ 119 లో గుర్తు తెలియని వ్యక్తులు ప్లాట్లు చేశారన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా.. స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారుల సహాయంతో అక్రమ నిర్మాణాలు, సరిహద్దు రాళ్ళను తొలగిస్తున్నట్లు తెలుస్తొంది.

Advertisement

Next Story

Most Viewed