హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద

by karthikeya |
హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్లకు భారీగా వరద పోటెత్తింది. ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్‌ (Usman Sagar)లో ఇన్‌ఫ్లో 1800 క్యూసెక్యులుగా ఉండగా.. హిమాయత్ సాగర్ (Himayat Sagar) ఇన్‌ఫ్లో 1400 క్యూసెక్యులుగా ఉంది. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు (3.900 టీఎంసీలు) కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1787.95 అడుగుల వరకు చేరుకుంది. అలాగే హిమాయత్ సాగర్ గరిష్ఠ నీటిమట్టం 1763 అగుడులు (2.970 టీఎంసీలు) కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1755.55 అడుగులుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకి ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి మూసీ నదిలోకి నీరు విడుదల చేయనున్న జీహెచ్‌ఎంసీ అధికారులు (GHMC officers) తెలిపారు.

కాగా.. రెండు జలాశయాల గేట్లు ఎత్తనుండడం వల్ల మూసీనదికి భారీగా వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉంది. దీంతో మూసీ పరిసర ప్రాంతాల్లో ఇరువైపుల నివాసం ఉంటున్న ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story