అయోధ్య రాములోరికి హైదరాబాద్ ఇచ్చే ప్రత్యేక కానుక ఇదే!

by GSrikanth |
అయోధ్య రాములోరికి హైదరాబాద్ ఇచ్చే ప్రత్యేక కానుక ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభం మూడు వారాల్లో జరుగనుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా అయోధ్య రాములోరి ప్రాణప్రతిష్ట అక్షింతలు దేశాన్ని చుట్టేస్తున్నాయి. మరోవైపు అయోధ్య రాముడికి హైదరాబాద్ నగరం అపురూపమైన కానుకలు అందించడానికి సిద్ధమైంది. రామ మందిరం దర్శించుకునే భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా హైదరాబాద్ శిల్పులు తమ వంతు కృషి చేస్తున్నారు.

ఇప్పటికే అయోధ్య రామాలయానికి 118 దర్వాజాలు హైదరాబాద్ బోయిన్ పల్లిలోని అనురాధ టింబర్ డిపోలో రూపుదిద్దుకుంటున్నాయి. తాజాగా రాముడికి రెండు జతల బంగారు పాదుకలు కూడా హైదరాబాద్ నుంచే వెళ్తున్నాయి. రాముడికి సుమారు రూ 1.03 కోట్ల విలువైన బంగారు పాదుకలను హైదరాబాద్ నగరానికి చెందిన అయోధ్య భాగ్య నగర సీతారామ ఫౌండేషన్ అందిస్తుంది. కాగా ఇప్పటికే ఒక జత పాదుకలను భక్తులు పాదయాత్రగా తీసుకెళుతున్నారు. ఈ పాదుకలను 25 రోజుల పాటు శ్రమించి శిల్పులు ఎంతో వైవిధ్యంగా రూపొందించారు. ఈనెల 10 నుంచి 15 మధ్యలో రెండు జతల పాదకులను ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అందించనున్నారు.

Advertisement

Next Story