దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందే నగరంగా హైదరాబాద్: మంత్రి కేటీఆర్

by Satheesh |
దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందే నగరంగా హైదరాబాద్: మంత్రి కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీ వ‌ర్క్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 100 కోట్ల పెట్టుబ‌డులు పెట్టిన‌ట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రామీణ ప్రాంత ఔత్సాహిక యువ‌త‌కు టీ వ‌ర్క్స్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. హైదరాబాద్ లోని రాయదుర్గం ఐటీ కారిడార్‌లో ఏర్పాటు చేసిన దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైపింగ్‌ కేంద్రంగా నిర్మించిన టీ-వర్క్స్‌ను ఫాక్స్ కాన్ సంస్థ చైర్మన్ యంగ్ లియూతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ఎనిమిదిన్నరేండ్లలో తెలంగాణ ఎన్నో విజ‌యాలు సాధించింద‌ని పేర్కొన్నారు.

ఇప్పటికే ఎన్నో పెట్టుబ‌డులు తెలంగాణ‌కు త‌ర‌లిరాగా, తాజాగా ఫాక్స్ కాన్ పెట్టుబ‌డులు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ స‌మ‌యంలో నియామ‌కాల్లో జ‌రుగుతున్న అన్యాయం గురించి పోరాటం చేశామని, పారిశ్రామిక వేత్తలు పెట్టుబ‌డుల‌తో తెలంగాణ యువ‌త‌కు ఉద్యోగాల ల‌భించ‌డం యువ‌త సంతోషంగా ఉన్నార‌ని పేర్కొన్నారు. ఫాక్స్ కాన్‌తో తెలంగాణ ప్రభుత్వ సంబంధాలు మున్ముందు మ‌రింత బ‌లోపేతం కావాల‌ని ఆకాంక్షించారు. హైద‌రాబాద్‌ను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే న‌గ‌రంగా తీర్చిదిద్దుతామ‌నే విశ్వాసం త‌న‌కు ఉంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ ముఖ్య కార్యద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్, టీ వ‌ర్క్స్ సీఈవో సంజ‌య్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed