అమెరికాలో హైదరాబాద్ యువతి మిస్సింగ్

by Ramesh N |
అమెరికాలో హైదరాబాద్ యువతి మిస్సింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాలో తెలుగు విద్యార్థుల వరుస మరణాలు, మిస్సింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఉన్నత చుదువుల కోసం అగ్రరాజ్యం వెళ్లిన విద్యార్థులు ఏదో ఒక సమస్యలో చిక్కుకుంటున్న ఘటనలు తరుచు చూస్తునే ఉన్నాం. తాజాగా అమెరికాలో తెలుగు విద్యార్థిని అదృశ్యమైంది. హైదరాబాద్‌కు చెందిన నితీశ కందుల (23) కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ, శాన్ బెర్నార్డినోలో చదువుతోంది.

అయితే ఈ యువతి పోయిన నెల 28వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. దీంతో యువతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న లాస్‌ఏంజెల్స్‌ పోలీసులు యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎవరికైన యువతి గురించి సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలంటూ సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్స్‌ ద్వారా స్థానికులను కోరారు.

Advertisement

Next Story

Most Viewed