- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బ్రేకింగ్: మొదలైన CWC మీటింగ్.. హాజరైన కాంగ్రెస్ అగ్రనేతలు..!
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే జాతీయ జెండాను ఆవిష్కరించి ఈ సమావేశాన్ని ప్రారంభించారు. సీడబ్ల్యూసీ సభ్యులు జాతీయ జెండాకు వందనం చేశారు. హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణ హాటల్‌లో జరుగుతోన్న ఈ సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. కాగా, మరికొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో జరుగుతోన్న ఈ సీడబ్ల్యూసీ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇక, ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ సభ్యులతో పాటు నాలుగు రాష్ట్రాల కాంగ్రెస్ సీఎంలు హాజరయ్యారు. వీరితో పాటు పార్టీ కీలక నేతలు కేసీ వేణుగోపాల్, సుర్జేవాలా, జైరాం రమేష్ తదితర నేతలు హాజరయ్యారు. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి.