Hyderabad: వరుస సెలవులు.. బోసిపోయిన హైదరాబాద్ సిటీ రహదారులు!

by Shiva |   ( Updated:14 Sept 2024 9:31 AM  )
Hyderabad: వరుస సెలవులు.. బోసిపోయిన హైదరాబాద్ సిటీ రహదారులు!
X

దిశ, వెబ్‌డెస్క్: వరుసగా సెలవులు రావడంతో నగరవాసులు ఎగిరి గంతేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఫ్యామిలీతో హాలీడేస్‌ (Holidays) ను స్పెండ్ చేసేందుకు పుణ్యక్షేత్రాలు, టూరిస్ట్ స్పాట్స్‌కు వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరం (Hyderabad City)లో వాహనాల రద్దీ భారీగా తగ్గింది. ప్రధాన కూడళ్లు అన్ని బోసిపోయి కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 14న రెండో శనివారం, 15న ఆదివారం, 16న మీలాద్ ఉన్ నబీ, 17న గణేష్ నిమజ్జనం ఉండటంతో స్కూళ్లు, కళాశాలలు ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. దీంతో యువత అంతా సిటీ శివార్లలోని ఫాంహౌస్‌ (Farm House)లలో సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇంకొందరు గణేష్ నిమజ్జనాల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈనెల 17న ఖైరతాబాద్ (Khairathabad) సప్తముఖ మహాశక్తి గణపతి నిమజ్జనం ఉండటంతో ఆయనను దర్శించుకునేందుకు సిటీ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు.

Advertisement

Next Story