HYD: కేబీఆర్ పార్కులో నటిని వెంబడించిన యువకుడు అరెస్ట్

by GSrikanth |   ( Updated:2023-03-02 05:52:18.0  )
HYD: కేబీఆర్ పార్కులో నటిని వెంబడించిన యువకుడు అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: యువనటి చౌరాసియా మరోసారి వార్తల్లోకెక్కింది. గతంలో బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేసిన చౌరాసియా.. తాజాగా అదే కేబీఆర్ పార్కులో మరో ఘటనతో వార్తల్లో నిలిచింది. కేబీఆర్ పార్కులో తనను ఓ యువకుడు వేధింపులకు గురిచేసినట్టు చౌరాసియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాకింగ్ చేస్తుంటే ఓ యువకుడు వెంటపడ్డాడని తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే, ఈ ఘటనతో రంగంలోకి దిగిన పోలీసులు. పార్కులోని సీసీ కెమెరాలు పరిశీలించారు.

ఈ నేఫథ్యంలో నటి చౌరాసియా వెంట ఎవరూ పడలేదని తేల్చారు. ఈ వ్యవహారంలో చౌరాసియాకు బంజారాహిల్స్ పోలీసులు కౌన్సిలింగ్ చేసి పంపించారు. అయితే, నవంబర్ 17, 2021లో చౌరాసియా ఇదే తరహాలో తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేశారు. ఈ ఘటన అప్పట్లో కలలం రేపింది. తాజా ఘటనపై బంజారాహిల్స్ పోలీసుల వివరాల ప్రకారం.. నటి చౌరాసియా జాగింగ్ చేసుకుంటా వెళ్తుంటే వెనకనుంచి ఫాలో చేశాడని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. విచారించి చూడగా అతను కూడా జాగింగ్ చేస్తున్నాడని పోలీసులు నిర్ధారించారు. అతడిని విచారించి, ఎక్కడుంటారని పూర్తి వివరాలు తెలుసుకొని వదిలేశామని తెలిపారు. అనంతరం నటికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed