- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
HYD : డ్రగ్స్ కేసు విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ డ్రగ్స్ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 62 మంది యువతులను వ్యభిచార కూపంలోకి జితిన్ దింపినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. 14 మంది హైదరాబాద్ యువతుల కాంటాక్ట్స్ ను పోలీసులు తాజాగా గుర్తించారు.
ఈ ముఠా హైదరాబాద్ లో అమ్మాయిలతో డ్రగ్స్ సరఫరా చేయిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. జితిన్ యువతులతో డ్రగ్స్ పార్టీ నిర్వహించాడని సమాచారం. ఈ కేసులో జితిన్ కస్టడీ కోరుతూ నార్కోటిక్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం బంజారాహిల్స్ పోలీసులు ముంబైకి చెందిన జితిన్ బాలచంద్ర భలే రావు(36), జావేద్ షంషేర్(34), ఆలీ సిద్ధిఖీ(34), జునైద్ షేక్(28), వికాస్ మోహన్ కుమార్(28)లను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ముంబైకి చెందిన జితిన్ బీమా ఏజెంట్ గా చెలామణి అవుతూ సింథటిక్ డీలర్ల నుంచి ప్రభుత్వం నిషేధించిన ఎండీఎంను కొనుగోలు చేసి వాటిని 5, 10 గ్రాములుగా మార్చి మార్చెట్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా విచారణలో తాజాగా జితిన్ సాగిస్తున్న వ్యభిచారం గుట్టు రట్టయింది.