- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD: సొంత పార్టీకి మరోసారి షాకిచ్చిన రాజాసింగ్.. ఈ సారి ఏం చేశారంటే?
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు ప్రధాన ఘట్టానికి చేరుకున్నాయి. వివిధ పార్టీల అభ్యర్థులు తమ అనుచరులు, ముఖ్య నాయకులతో పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ప్రచార పర్వంలోకి దూకి సందడి చేస్తూ.. గడపగడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అన్ని పార్టీల హడావుడి అలా ఉంటే బీజేపీ తంతు మరోలా ఉంది. రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన నాటి నుంచి అధిష్టానంపై కాస్త గుర్రుగా ఉన్న ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సొంత పార్టీకి ఝలక్ ఇచ్చారు.
హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కార్యక్రమానికి వస్తానని చెప్పి చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారు. అయితే, హైదరాబాద్ అభ్యర్థిగా మాధవీలతను ప్రకటించిన నాటి నుంచి రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా.. తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఆమెను పేరును ఖరారు చేయడం రాజసింగ్‌కు మింగుడు పడటం లేదు. ఇదే ఇష్యూపై ఢిల్లీలోని పార్టీ పెద్దలు కూడా ఆయన బుజ్జగిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇప్పటికైనా రాజాసింగ్ మాధవీ లత ప్రచారంలో పాల్గొంటారా.. లేక డుమ్మా కొడతారా అనేది అసక్తిగా మారింది.