HYD: గోషామహల్‌లో భారీగా కుంగిన నాలా రోడ్డు.. తప్పిన పెను ప్రమాదం

by Ramesh Goud |
HYD: గోషామహల్‌లో భారీగా కుంగిన నాలా రోడ్డు.. తప్పిన పెను ప్రమాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: గోషామహల్‌లో నాలా రోడ్డు భారీగా కుంగింది. అర్థరాత్రి సమయం కావడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టు అయ్యింది. బుధవారం దారుస్సలాం రోడ్డు నుంచి చక్నావాడి వెళ్లే రోడ్డు మార్గంలో ప్లైవుడ్ దుకాణాల ముందు సీవరేజ్ పెద్ద నాలా అకస్మాత్తుగా భూమిలోకి కూలిపోయింది. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. గతంలో కూడా ఈ ప్రాంతంలోనే నాలా కుంగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇది జరిగి దాదాపు రెండేళ్లు గడుస్తుందని, ప్రస్తుతం కుంగిన ప్రాంతానికి 200 మీటర్ల దూరంలోనే అప్పుడు కుంగిందని, దానికి వెంటనే మరమ్మత్తులు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుత ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది కుంగిన నాలాను పరిశీలించారు. అంతేగాక రోడ్డు కూలిపోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రజల భద్రత దృష్యా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed