- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD : డ్రగ్స్ ముఠా అరెస్ట్.. రూ.కోటి 33లక్షల విలువ గల కొకైన్..
దిశ, శేరిలింగంపల్లి : హైదరాబాద్ భారీ మొత్తంలో కొకైన్ పట్టుబడటం కలకలం రేపింది.సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ప్రధాన నిందితుడు నైజీరీయన్ తప్పించుకోగా ఐదుగురిని సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం మీడియా సమక్షంలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన డ్రై ఫ్రూట్స్ బిజినెస్ చేసే చింతా రాకేష్ అందులో నష్టాలు రావడంతో నైజీరియాకు చెందిన ఏ2 నిందితుడు గాబ్రియేల్ పెటిట్, గజ్జెల శ్రీనివాస్ రెడ్డి, సూర్య ప్రకాష్, నైజీరియాకు చెందిన విక్టర్ చుక్వాతో కలిసి
డ్రగ్స్ సరఫరాను మొదలు పెట్టాడని తెలిపారు. అయితే హైదరాబాద్‌లో ఉన్న ఈ ముఠాకు రాకేష్ కింగ్ పిన్ అని, గోవా నుంచి కొక్తెన్ తెచ్చి సప్లై చేస్తున్నట్టు సీపీ వెల్లడించారు. గోవాలో రూ.7వేలకు గ్రాము చొప్పున కొకైన్ కొనుగోలు చేసి.. హైదరాబాద్‌లో రూ.18వేలకు అమ్మతున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో కొకైన్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని అందుకే ఇక్కడకు అక్రమంగా రవాణా చేసి అమ్మకాలు చేస్తున్నారని వివరించారు. నిందితుల నుంచి రూ.కోటి 33లక్షల విలువ గల 303 గ్రాముల కొకైన్, రెండు కార్లు, 5 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఈ ముఠాలోని ఏ4 నిందితుడు సూర్య ప్రకాష్‌ని పట్టుకోవడం వల్ల డ్రగ్స్ ముఠా గుట్టు బయటపడ్డిందని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
డ్రగ్స్, కొకైన్ ఎవరెవరు కొనుగోలు చేస్తున్నారు, ఎక్కడికి సరఫరా చేస్తున్నారో తెలుసుకునే పనిలో ఉన్నామని చెప్పారు. వారిని పట్టుకుని ఎన్‌డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 27 ప్రకారం నోటీసులు ఇస్తామన్నారు. వాట్సాప్ ద్వారా కస్టమర్లను ఈ ముఠా సంప్రదిస్తున్నట్లు తమ విచారణలో గుర్తించామన్నారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీలు హోస్ట్ చేసి, కస్టమర్లను పిలిచి అక్కడ డ్రగ్స్ సప్లై చేస్తున్నారని చెప్పారు. నిందితుల వాట్సాప్ చాట్‌లో కొంతమంది ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఉన్నారని సీపీ అన్నారు. ఈ ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్‌ఓటీ సిబ్బందిని సీపీ అభినందించారు.