- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD: మల్లారెడ్డి ఆసుపత్రిలో దారుణం.. డాక్టర్ల నిర్లక్ష్యానికి యువతి మృతి
దిశ, వెబ్ డెస్క్: డాక్టర్ల నిర్లక్ష్యానికి(Doctor's Negligence) యువతి మృతి(woman died) చెందిన దారుణ ఘటన(Tragic Incident) మల్లారెడ్డి ఆసుపత్రి(Mallareddy Hospital)లో జరిగింది. ఘటన ప్రకారం మాధవి(Madhavi) అనే యువతి కిడ్నీలో రాళ్లు(Kidney Stones) ఉన్నాయని ఆపరేషన్(Operation) కోసం హైదరాబాద్ లోని మాజీ మంత్రి మల్లారెడ్డి(Ex Minister Malla Reddy)కి చెందిన హస్పిటల్‌లో చేరింది. వైద్యులు ఆపరేషన్ చేస్తున్న సమయంలో తీవ్ర రక్త స్రావం అవ్వడంతో ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీనిపై బంధువులు వైద్యులను ప్రశ్నించగా.. నిజాన్ని దాచి, ఆపరేషన్ కు సమయం పడుతుందని బుకాయించే ప్రయత్నం చేశారు.
దీంతో పేషంట్ బంధువులు నిజం చెప్పాలని వైద్యులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం కొద్ది సేపటికే ఆపరేషన్ వికటించి మహిళ మృతి చెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే మాధవికి తీవ్ర రక్త స్రావం అయ్యిందని, నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేయడం వల్లనే మాధవి మరణించిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైద్యం కోసం వస్తే మృతదేహాన్ని చేతిలో పెడుతున్నారని, తమకు న్యాయం చేయాలని మల్లారెడ్డి ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఈ ఘటనపై స్పందించిన జిల్లా డీఎంహెచ్ఓ(DMHO), వైద్య అధికారుల బృందం మల్లారెడ్డి ఆసుపత్రికి చేరుకొని, మాధవి మృతిపై విచారిస్తున్నారు.