- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్యాంక్ బండ్ వద్దకు మహాగణపతి.. ఆకాశంలో భారీ సంఖ్యలో డ్రోన్లు
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే అత్యంత ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం చివరి అంకానికి చేరుకుంది. పోలీసులు ముందస్తు ప్రణాళికల్లో భాగంగా సోమవారం అన్ని కార్యక్రమాలను నిర్వహించుకున్న మహాగణపతి గంగమ్మ ఓడికి చేరుకునేందుకు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నాడు. ఈ ఖైరతాబాద్ వినాయకుడు రాష్ట్ర సచివాలయం ముందుకు రాగానే ఒక్కసారిగా గాలిలో పదుల సంఖ్యలో డ్రోన్‌లు చక్కర్లు కొట్టాయి. దీంతో ఆకాశంలో ఎటు చూసిన డ్రోన్‌లు.. గద్దల మాదిరిగా ఎగురుతూ కనిపించాయి. మహాగణపతిని తమ కెమెరాల్లో చిత్రీకరించేందుకు వందల సంఖ్యలో యూట్యూబర్లు ఈ డ్రోన్లను గాలిలో ఎగురవేశారు. ఇదిలా ఉండే మరికొన్ని క్షణాల్లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి కాబోతుంది. ప్రస్తుతం ట్రక్ నుంచి వినాయకుడని విడదీసి.. క్రేన్ వైర్లను కట్టే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. కాగా ఈ ప్రక్రియను మొత్తం సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు.