Falaknuma Express : ఫలక్‌నుమా ఎక్స్ ప్రెస్‌లో భారీ అగ్ని ప్రమాదం..

by Satheesh |   ( Updated:2023-07-07 06:50:32.0  )
Falaknuma Express : ఫలక్‌నుమా ఎక్స్ ప్రెస్‌లో భారీ అగ్ని ప్రమాదం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఫలక్‌నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు బోగీలు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. ముందుగా రైలు నుండి పొగ రావడంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ప్రయాణికులను అలర్ట్ చేశారు. దీంతో వెంటనే ప్రయాణికులను రైలు నుండి దింపేశారు. సిబ్బంది ముందుగానే పసిగట్టి ప్రయాణికులను రైలు నుండి దింపేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన భువనగిరి జిల్లాలోని బొమ్మాయిపల్లి- పగిడిపల్లి మార్గంలో చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రైలును బొమ్మాయిపల్లి వద్ద నిలిపివేశారు. రైల్వే అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపీరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఘటన స్థలానికి బయలు దేరారు.

Advertisement

Next Story

Most Viewed