Encounter: తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-01 03:12:05.0  )
Encounter: తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది. ములుగు జిల్లాలో గ్రేహౌండ్స్ బలగాలు(Greyhounds Forces), మావోయిస్టు(Maoists)లకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. మృతుల్లో కీలక మావోయిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం ములుగు(Mulugu) జిల్లాలోని చల్పాక సమీపంలోని అటవీప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది. ఘటనా స్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed