BRS MLA Chittem Ram Mohan Reddy :ఎమ్మెల్యే చిట్టెం బర్త్‌డే‌కు భారీ ఏర్పాట్లు

by Sathputhe Rajesh |   ( Updated:2023-01-30 07:24:45.0  )
BRS MLA Chittem Ram Mohan Reddy :ఎమ్మెల్యే చిట్టెం బర్త్‌డే‌కు భారీ ఏర్పాట్లు
X

దిశ, అమరచింత: మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలకు బీఆర్ఎస్ శ్రేణులు సోమవారం భారీ ఏర్పాట్లు చేశారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి‌కి సంబంధించిన భారీ కటౌట్లు, బర్త్ డే బెలూన్స్, ఫ్లెక్సీలతో పట్టణాన్ని గులాబీ మయంగా మార్చారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యం. రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. అందరి ఆశీర్వాదంతో ముచ్చటగా 3సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నారని తెలిపారు. తమ నాయకుడి జన్మదిన వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశామన్నారు. మక్తల్ సెగ్మెంట్‌లో ఆత్మకూర్ లో పెద్ద మొత్తంలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ఎమ్మెల్యేకు గజమాలతో స్వాగతం

పట్టణంలో బాణసంచా కాలుస్తూ వందలాది మందితో భారీ ఊరేగింపు ఉంటుందన్నారు. వెంకటేశ్వర స్వామి గ్రౌండ్‌లో మండలంలోని అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కటింగ్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీలో అందరిని సమన్వయం చేసుకుని మండల కమిటీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరుపనున్నట్లు వెల్లడించారు. అన్నదానంతో పాటు వివిధ సేవాకార్యక్రమలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ బర్త్ డే సంబరాలు బీఆర్ శ్రేణుల్లో నూతన ఉత్సహాన్ని నింపుతాయని భావిస్తున్నారు.

Read more:

BRS MLA Chittem Ram Mohan Reddy :ఎమ్మెల్యే చిట్టెంకు సొంత పార్టీ నాయకుల షాక్!

Advertisement

Next Story

Most Viewed