"కాంగ్రెస్ షెహజాదా" వారి నుంచి ఎంత సేకరించారు.. రాహుల్ గాంధీపై మోడీ విమర్శలు

by Ramesh Goud |   ( Updated:2024-05-08 13:55:38.0  )
కాంగ్రెస్ షెహజాదా వారి నుంచి ఎంత సేకరించారు.. రాహుల్ గాంధీపై మోడీ విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ షెహజాదా అంబానీ- అదానీ ల గురించి మాట్లడటం మానేశారని, వారి నుంచి ఎంత సేకరించారో చెప్పాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ కు చెందిన షెహజాదా తన రాఫెల్ అంశం పునాది అయినప్పటి నుండి అంబానీ, అదానీల గురించి మాట్లాడటం ప్రారంభించాడని చెప్పారు. గడిచిన ఐదేళ్లలో ఐదు మంది పారిశ్రామిక వేత్తల గురించి మాట్లాడారు. కానీ ఎన్నికలు ప్రకటించిన నాటి నుండి అంబానీ, అదానీల ఊసెత్తడం లేదన్నారు.

దీనిపై షెహజాదా అంబానీ, అదానీల నుండి ఎంత మాల్ సేకరించిందో చెప్పాలి. రాత్రికి రాత్రే అంబానీ- అదానీల పేర్లు దుర్వినియోగం చేయడం మానేయడం పట్ల ఎంత డీల్ కుదిరిందో చెప్పాలని మోడీ ప్రశ్నించారు. అంతేగాక బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు హైదరాబాద్ ను ఇన్ని సంవత్సరాలు ఎంఐఎంకు లీజ్ కు ఇచ్చాయని అన్నారు. మొట్టమొదటి సారిగా ఏఐఎంఐఎం ను సవాల్ చేసిన పార్టీ ఏదైన ఉందంటే.. అది బీజేపీ మాత్రమేనని తేల్చి చెప్పారు. బీజేపీ వచ్చిన సవాల్ తో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు విలవిలలాడుతున్నాయని, అందుకే హైదరాబాద్ లో ఏఐఎంఐఎం ను గెలిపించడానికి ఈ రెండు పార్టీలు సహకరిస్తున్నాయని ఆరోపించారు.

Read More...

తెలంగాణలోని ఆ జిల్లాలో మోడీకి యువ మిత్రుడు..ఫోటో విడుదల చేసిన ప్రధాని

Advertisement

Next Story

Most Viewed