- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Hot News: పీసీసీ కొత్త బాస్ ఎంపికపై వీడనున్న సస్పెన్స్..! ఫైనల్ లిస్ట్‌లో ఆ ముగ్గురి పేర్లు
దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీకి కొత్త చీఫ్ ను నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నది. అందులో భాగంగా ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో నేడు ఏఐసీసీ నేతలు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ ముగ్గురి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. అలాగే కేబినెట్ విస్తరణపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. పూర్తి స్థాయి అధ్యక్షుడి నేతృత్వంలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని, లేకపోతే కేడర్ కు దిశానిర్దేశం చేయడంలో ఇబ్బందులు వస్తాయని అధిష్టానం భావిస్తున్నది.
కన్సల్టేషన్ తరువాతే నిర్ణయం
కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఎవరిని నియమించాలనే అంశంపై పార్టీలో ఉన్న సీనియర్ లీడర్ల అభిప్రాయాలు తీసుకుంటున్నది. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు వస్తాయేమోననే ఉద్దేశ్యంతో సంప్రదింపులు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో చర్చించేందుకు ఢిల్లీకి ఆహ్వానించారు. ఈ ముగ్గురు నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. అయితే ఈ ముగ్గురూ ఒకే వ్యక్తి పేరును సూచిస్తారా? లేకపోతే ఒక్కొక్కరు ఒక్కో వ్యక్తిని ప్రపోజ్ చేస్తారా? అనే ఆసక్తి నెలకొన్నది. ఒకవేళ భిన్నాభిప్రాయాలు వస్తే, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది.
ఫైనల్ లిస్టులో ముగ్గురి పేర్లు
పీసీసీ అధ్యక్షుడి కోసం చాలా మంది రేసులో ఉన్నా, ఫైనల్ లిస్టులో బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఎస్సీ వర్గం నుంచి విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎస్టీ వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ పేర్లు ఉన్నట్టు తెలిసింది. అయితే ఇందులో ఎవరిని నియమిస్తే పార్టీకి ఉపయోగం ఉంటుంది? అపోజిషన్ ను ఎవరు సమర్థవంతంగా ఎదుర్కోగలరు? కేడర్ ను ఎవరు కో–ఆర్డినేషన్ చేయగలరు? అనే కోణంలో అధిష్టానం ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది. అలాగే పీసీసీ పదవి ఒక సామాజిక వర్గానికి ఇస్తే, త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణలో ఆ వర్గానికి మంత్రి పదవి ఉండదని హైకమాండ్ స్పష్టం చేసినట్టు తెలిసింది.
కొత్త పీసీసీ నేతృత్వంలోనే ఎన్నికలు
లోకల్ బాడీ ఎలక్షన్ షెడ్యూలు వచ్చేలోపు పీసీసీ చీఫ్ పై పైనల్ చేయాలని ఏఐసీసీ భావిస్తున్నది. లేకపోతే అటు ప్రభుత్వం, ఇటు పార్టీ కార్యక్రమాల కోసం రేవంత్ పూర్తి స్థాయి సమయం కేటాయించడం కష్టంగా ఉంటుందని, అందుకే కొత్త అధ్యక్షుడి పర్యవేక్షణ, స్ట్రాటజీతోనే ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ సైతం భావిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ మధ్య ప్రభుత్వం అమలు చేస్తున్న రూ. 2 లక్షల రుణమాఫీ స్కీమ్ విషయంలో పార్టీ కేడర్ ఆశించిన స్థాయిలో ప్రచారం చేయలేదని టాక్ ఉంది. ఒకవేళ పూర్తి స్థాయి అధ్యక్షుడు ఉంటే ఉత్సవాలు, సంబరాలు పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉండేదని చర్చ జరిగింది.
కేబినెట్ విస్తరణపైనా చర్చ?
పీసీసీ అధ్యక్షుడి ఎంపికతోపాటు కేబినెట్ విస్తరణపై కూడా హైకమాండ్ వద్ద చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సీఎంతో కలుపుకుని మొత్తం 12 మంది మంత్రులు ఉండగా, మరో ఆరుగురికి కేబినెట్ లో చోటు ఉంది. అయితే ప్రస్తుతం సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ముగ్గురు లేదా నలుగురిని కేబినెట్ లోకి తీసుకునే చాన్స్ ఉందని కాంగ్రెస్ అధిష్టానానికి సన్నిహితంగా ఉండే ఓ లీడర్ వివరించారు. ఒకవేళ విస్తరణ జరిగితే ఇద్దరు రెడ్లు, ఒక ఎస్సీ, ఒక మైనార్టీకు చాన్స్ ఉంటుందని, లేకపోతే లోకల్ బాడీ ఎన్నికల తర్వాతనే ముహుర్తం ఉండొచ్చని సదరు లీడర్ కామెంట్ చేశారు.