Hot News: కాంగ్రెస్ చేతిలో కవిత ‘బెయిల్’ అస్త్రం! బీఆర్ఎస్, బీజేపీని డ్యామేజ్ చేసేలా పక్కా ప్లాన్

by Shiva |
Hot News: కాంగ్రెస్ చేతిలో కవిత ‘బెయిల్’ అస్త్రం! బీఆర్ఎస్, బీజేపీని డ్యామేజ్ చేసేలా పక్కా ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత‌కు బెయిల్ రావడంతో బీఆర్ఎస్, బీజేపీ‌లపై కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు ఇంటర్నల్ ఒప్పందాలతోనే ముందుకు సాగుతున్నాయని తాము మొదట్నుంచి చెబుతున్నామని, బెయిల్ అంశంతో ప్రజలకు స్పష్టత వచ్చేసిందని విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు సామా రామ్మోహన్, జగ్గారెడ్డి, శోభారాణి, బెల్లయ్య నాయక్, ఈరవత్రి అనిల్, తదితరులు విమర్శలు గుప్పించారు. ఎంపీ ఎన్నికల నుంచే ఈ లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయని, కానీ బయట పడకుండా తెలివిగా మెయింటెన్ చేశారని, బెయిల్ తో ఆ నేతల బండారం బయటపడిందని పేర్కొన్నారు.

ఈ అంశంపై విస్తృత ప్రచారం

బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందాలే కవితకు బెయిల్ వచ్చేలా చేశాయని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు ఇదే అంశాన్ని టీపీసీసీ పుల్ పబ్లిసిటీ చేయాలని భావిస్తున్నది. కవిత అంశాన్ని ఊదాహరణగా ప్రస్తావిస్తే జనాల్లోకి ఈజీగా వెళ్తుందనేది కాంగ్రెస్ నేతల అభిప్రాయం. ఆ రెండు పార్టీ లను డ్యామేజ్ చేసేందుకు ఈ ఒక్క అస్త్రం చాలనే అభిప్రాయం ఎక్కువ మంది నేతల నుంచి వినిపించింది. దీంతో అన్ని జిల్లాల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని టీపీసీసీ నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం భారీ స్థాయిలో ఫ్లెక్సీలు, హోర్డింగులను పెట్టాలని భావిస్తున్నారు. అంతేగాక సోషల్ మీడియా, మీడియాల్లోనూ పబ్లిసిటీ చేయాలని పార్టీ ఆలోచిస్తున్నది.

చేరికలను ప్రోత్సహించేలా..

త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. దీంతో కాంగ్రెస్ గ్రౌండ్ లెవల్ లో తన బలాన్ని మరింత పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. తద్వారా లోకల్ బాడీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని, త్వరలోనే విలీనం కాబోతున్నాయని స్థానిక నేతలకు కాంగ్రెస్ వివరించనున్నది. దీని వలన రాజకీయ భవిష్యత్తును కోల్పోతారంటూ పార్టీ నేతలు ఆయా స్థానిక నేతలకు చెప్పనున్నారు. పదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ దే పవర్ అని, కండువా కప్పుకుంటే పొలిటికల్ జర్నీ బాగుటుందని సూచించనున్నారు. ఈ ఈక్రమంలో లోకల్ లీడర్లందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పేందుకు టీపీసీసీ తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed