- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLC కవిత కోసం హోంమంత్రి ప్రత్యేక ప్రార్థనలు
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజును పురస్కరించుకుని హోంమంత్రి మహమూద్ అలీ సోమవారం రాజస్తాన్‌లోని అజ్మీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవితను రాజకీయంగా ఎదుర్కోలేక బీజేపీ ప్రభుత్వం సీబీఐ, ఈడీలను ఉసిగొల్పి ఇబ్బంది పెడుతోందని అన్నారు. కేంద్రం చేస్తున్న ఈ కుట్రలను బీఆర్ఎస్ సమర్థంగా ఎదుర్కోవటమే కాదు ధీటైన సమాధానం ఇస్తుందని చెప్పారు. ఇక, అజ్మీర్ దర్గాకు వచ్చే తెలంగాణ వాసుల వసతి సదుపాయాలపై హోంమంత్రి మహమూద్ అలీ స్థానిక అధికారులతో సమీక్ష జరిపారు.
రాజస్తాన్ మైనారిటీ శాఖ మంత్రి సలెహ్ మహ్మద్, కలెక్టర్ అన్షిదీప్, అభివృద్ధి విభాగం అధికారి అక్షయ్ తదితరులతో చర్చలు జరిపారు. గతంలో వసతి సదుపాయాల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం 2.40 కోట్ల రూపాయలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అవసరమైన భూమి కొనుగోలు, రిజిస్ర్టేషన్ తదితర పనుల కోసం ఈ నిధులు వెచ్చించి త్వరితగతిన పనులు చేపట్టాలని సూచించారు. మంత్రి వెంట బీఆర్ఎస్ నాయకులు షరీఫుద్దీన్, పుర్ఖాన్ అలీ తదితరులు ఉన్నారు.