Holiday: నగరవాసులకు భారీ గుడ్ న్యూస్.. ఆ రోజు హాలిడే ప్రకటించిన ప్రభుత్వం

by Shiva |
Holiday: నగరవాసులకు భారీ గుడ్ న్యూస్.. ఆ రోజు హాలిడే ప్రకటించిన ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: జంట నగరాల్లో వినాయక నిమజ్జనానికి (Ganesh immersion) చెప్పలేనంత క్రేజ్ ఉంది. హుస్సేన్ సాగర్‌ (Hussain Sagar) వద్ద తీరొక్క గణనాథులను వీక్షించేందుకు భక్తులు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వస్తారంటే నిమజ్జనానికి ఉన్న ప్రధాన్యత ఎలాంటిదో చెప్పవచ్చు. మరోవైపు ఖైరతాబాద్ (Khairathabad) మహా గణపతిని కనులారా వీక్షించి దర్శించుకునేందుకు సిటీవాసులు క్యూ కడతారు. ఈ క్రమంలోనే ప్రధాన రహదారులు అన్ని కిక్కిరిసిపోతాయి. భారీ పోలీసు బందోబస్తు, సీసీ టీవీ (CC TV)ల పర్యవేక్షణలో నిమజ్జన కార్యక్రమం కొనసాగనుంది. ఈ క్రమంలో శాంతిభద్రలకు విఘాతం కలిగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 17న జంట నగరాల (Twin Cities) పరిధిలో సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, స్కూళ్లు, కళాశాలలు మూత పడనున్నాయి. అదేవిధంగా సెప్టెంబర్ 17కు బదులు నవంబర్ 9న రెండో శనివారం పని దినంగా ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed