- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాఠ్యపుస్తకాల్లో చాకలి ఐలమ్మ చరిత్ర లేకపోవడం దురుదృష్టకరం: MP లక్ష్మణ్
దిశ, తెలంగాణ బ్యూరో: చాకలి ఐలమ్మ చరిత్ర పాఠ్యపుస్తకాల్లో లేకపోవడం దురదృష్టకరమని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, కొమరం భీమ్, షోయబుల్లా ఖాన్‌లు తెలంగాణ విముక్తి కోసం చేసిన పోరాటం గొప్పదని వివరించారు.
తెలంగాణ చరిత్రను ప్రపంచానికి తెలిసే విధంగా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవ వారోత్సవాలను మోడీ ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని మోడీ సర్కార్ విశ్వకర్మ పథకం కింద 13 వేల కోట్లను కుల వృత్తుల వారికి ఆర్థిక సహాయం చేస్తుందని తెలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ బీసీ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీసీలే ప్రధాన పాత్ర పోషిస్తారని, కేసీఆర్‌కు గుణపాఠం చెప్తారన్నారు. మహిళలతో పాటు, ఓబీసీల అభివృద్ధికి మోడీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని లక్ష్మణ్ పేర్కొన్నారు.