వరల్డ్ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో బతుకమ్మ

by karthikeya |
వరల్డ్ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో బతుకమ్మ
X

దిశ, వెబ్‌డెస్క్/జనగామ: జనగామ జిల్లాలో బతుకమ్మ వేడుకలు రికార్డులు బ్రేక్ చేశాయి. పండుగ నేపథ్యంలో జనగామ జిల్లా కేంద్రంలోని స్థానిక నెహ్రూ పార్క్ సెయింట్ మేరీస్ స్కూల్‌లో ముందస్తు వేడుకలు నిర్వహించగా.. 24 గంటల్లో 700 మంది విద్యార్థులతో 36.2 అడుగుల బతుకమ్మను తయారుచేశారు. దీంతో ఈ బతుకమ్మ వరల్డ్ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది. కాగా.. గతంలో అతిపెద్ద బతుకమ్మగా 31 అడుగుల బతుకమ్మ రికార్డు నెలకొల్పగా.. తాజాగా ఆ రికార్డును జనగామ బతుకమ్మ బద్దలు కొట్టడం జరిగింది.

ఇదిలా ఉంటే ఈ రోజు (బుధవారం) నుంచి తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఎంగిలి బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అధికారిక షెడ్యూల్‌ని కూడా ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం 10 రోజుల పాటు ఉత్సవాలు జరగనుండగా.. ఆఖరి రోజు సద్దుల బతుకమ్మ వేడుకలను ట్యాంక్ బండ్ వద్ద ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా పాల్గొననున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed