- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద హై టెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు
దిశ, సిటీ బ్యూరో : హైదరాబాద్ మహానగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ఎన్నో అవార్డు రావడానికి కారణమైన ఔట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు జరగనున్న కౌన్సిల్ మీటింగ్‌కు బీజేపీ కార్పొరేటర్లు శానిటేషన్ కార్మికుల రూపంలో హాజరయ్యారు.
అంతకుముందే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం చేరుకున్న కాంగ్రెస్ కార్పొరేటర్లు ఔట్ సోర్స్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని సర్కారు జీహెచ్ఎంసీకి పదివేల కోట్ల గ్రాంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ రాజశేఖర్ నేతృతంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు, బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ నేతృత్వంలో కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు జరిగిన ఆరు సమావేశాలలో ప్రజల సమస్యలపై ఇలాంటి జరగలేదని, కనీసం ఈనాటి సమావేశంలోనైనా ప్రజల సమస్యలపై చర్చ జరగాలని శ్రావణ్ డిమాండ్ చేశారు.
ఒంటరైన అధికార పార్టీ
అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్న విషయంపై కౌన్సిల్ సభలో అధికార పార్టీ ఒంటరి అయింది. ఉదయం 11 గంటలకు గందరగోళం మధ్య ప్రారంభమైన కౌన్సిల్ సమావేశంలో ఒక్కో పార్టీ తరపున ఒక్కొక్క కార్పొరేటర్ మాట్లాడాలని మేయర్ సూచించడంతో మజ్లీస్ నుంచి సలీం బేగ్, బీజేపీ నుంచి వంగ మధుసూదన్, కాంగ్రెస్ తరపున రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జీహెచ్ఎంసీ శానిటేషన్ అవుట్ సోర్స్ కార్మికులు క్షేమంగా ఉంటేనే నగరం పరిశుభ్రంగా అందంగా ఉంటుందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని వారిని వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షమైన మజ్లీస్ పార్టీ ఎందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని షాక్ కు గురయింది. గందరగోళ వాతావరణంలో ఇంకా కౌన్సిల్ సమావేశం కొనసాగుతుంది. ప్రస్తుతం నగర అభివృద్ధిపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు మాట్లాడుతున్నారు.
మీడియాపై ఆంక్షలు
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కవరింగ్ చేసేందుకు మీడియాను అనుమతించకుండా అర్థరహితమైన ఆంక్షలను పోలీసులు విధించారు. మీడియాకు అనుమతి ఇవ్వకపోవడం పట్ల బీజేపీ కాంగ్రెస్ కార్పొరేటర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, పారదర్శకంగా సమావేశం నిర్వహించాలని, మీడియాను అనుమతించాలని డిమాండ్ చేశారు.