- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దానం నాగేందర్ సహా నలుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
దిశ, వెబ్‌డెస్క్: నలుగురు ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల పిటిషన్లపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల అఫిడవిట్‌లో అవకతవకలు, ఓటర్లకు డబ్బులు పంచారన్న ఆరోపణలపై నోటీసులు ఇచ్చింది. నోటీసులు అందుకున్న వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మీ, మాగంటి గోపీనాథ్, ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌తో పాటు సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావులు ఉన్నారు.
కాగా, బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిసిన దానం నాగేందర్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆశించిన ఫలితాలు రాకపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో దానం నాగేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరారు. దాంతో ఆయన పదవిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు లోక్ సభ స్వీకర్‌కు వినతి పత్రం ఇచ్చారు.