తెలంగాణలో ప్రభుత్వం మారడంపై హీరో నాని హాట్ కామెంట్స్

by GSrikanth |
తెలంగాణలో ప్రభుత్వం మారడంపై హీరో నాని హాట్ కామెంట్స్
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని డిశంబర్ 7న ‘హాయ్ నాన్న’తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. మృణాల్ ఠాకూర్, బేబీ కియారా నటించిన ఈ చిత్రం ఫాదర్-డాటర్ సెంటిమెంట్‌తో రాబోతుండటం.. ట్రైలర్, సాంగ్స్‌ సూపర్ డూపర్‌గా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయిన నాని.. ట్విట్టర్‌లో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. ఈ క్రమంలోనే ‘తెలంగాణలో ఎలక్షన్ రిజల్ట్’ గురించి ఓ అభిమాని ప్రశ్నించగా.. ‘పదేళ్లు బ్లాక్ బస్టర్ సినిమా చూశాం. థియేటర్‌లో సినిమా మారింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం’ అని రిప్లయ్ ఇచ్చాడు. ఇక నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్‌తో చేయాలని అనుకుంటున్నారని అడగ్గా.. ‘బలగం’ దర్శకుడు వేణుతో చేయాలని ఉందని చెప్పాడు.

Advertisement

Next Story