- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG News : మహిళలు లక్షలు సంపాదించే మార్గం ఇదిగో

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో మహిళలు లక్షాధికారులు అయ్యే మార్గం చూపిస్తోంది రేవంత్ సర్కార్. రాష్ట్రంలో ఆడపడుచులు ఎవ్వరి మీద ఆధారపడకుండా లక్షలు సంపాదించేందుకు ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). "రాజీవ్ యువ వికాస పథకం"(Rajiv Yuva Vikasa Scheme)లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 18 నుంచి 55 ఏళ్ల వయసున్న మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు 400000/- వరకు ఆర్ధిక ఋణ సహాయం అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt). ముఖ్యంగా మహిళలు నిర్వహించే బ్యూటీ పార్లర్, టైలరింగ్, కర్రీ పాయింట్, బట్టల దుకాణం, కూరగాయల దుకాణం, అగరబత్తుల తయారీ, చీరల వ్యాపారం, లేడీస్ కార్నర్ వంటి వ్యాపారాలకు ఆర్థిక సహాయం అందించనుంది. అయితే ఈ రుణాలపై 60 % -80% సబ్సిడీ కూడా అందివ్వనుంది. రాజీవ్ యువ వికాస ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ 5/4/2025. అయితే ఒక రేషన్ కార్డు(Ration Card)లో ఉన్న సభ్యుల్లో ఒక మహిళ మాత్రమే ఈ పథకానికి అర్హురాలు.
ఈ దరఖాస్తుకు కావాల్సిన అర్హత పత్రాలు ఇవే
1. ఆధార్
2. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి
3. పాన్ కార్డు
4. Passport ఫోటో
5. లబ్ధిదారురాలి ఫోన్ నంబర్