- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్.. 10 కిలో మీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు..!
దిశ, వెబ్‌డెస్క్: సంకాంత్రి పండుగకు సెలవులు రావడంతో అందరూ సొంతూళ్లా బాటపట్టారు. దీంతో జాతీయ రహదారులన్ని వాహనాలతో నిండిపోయాయి. కిలో మీటర్ల పొడవునా ఎటూ చూసిన వాహనాలే కనిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుండి సెలవులు ప్రారంభం కావడంతో శుక్రవారం రోడ్లపై ట్రాఫిక్ మరింత ఎక్కువైంది. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ హైవే వాహనాలతో నిండిపోయింది. 10 కిలోమీటర్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇబ్రహీంపట్నం-విజయవాడ హైవేపై కూడా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఈ హైవేపై 4 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రంగంలోకి దిగిన అధికారులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమైయ్యారు. ఆర్టీసీ బస్సులు వెళ్లేందుకు ప్రత్యేక లైన్‌లు ఏర్పాటు చేసినప్పటికి.. వాహనాలు భారీగా రావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.