Rain Updates: తెలంగాణలో మరోసారి అతిభారీ వర్షాలు

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-04 15:03:30.0  )
Rain Updates: తెలంగాణలో మరోసారి అతిభారీ వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో గతవారం కురిసిన వర్షాలు(Rain) ఎంతటి బీభత్సం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. గ్రామాలకు గ్రామాలు నీట మునిగాయి. రోడ్లపైకి వరదనీరు చేరి పదుల సంఖ్యలో జనాలు మృతిచెందారు. ఇంకా ముంపులోనే రెండు రాష్ట్రాల్లో అనేక గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ(Meteorology Department) మరో హెచ్చరిక చేశారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణలో మరోసారి వర్షం బీభత్సం సృష్టించనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) తెలిపింది. గురువారం ఉదయం 8 గంటల వరకు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతాయని వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Advertisement

Next Story

Most Viewed