- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గిరిజన రిజర్వేషన్ల పెంపు పిటిషన్‌పై సుప్రీం విచారణ
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ల పెంపుపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. గిరిజన సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర హైకోర్టులోనే పిటిషన్ దాఖలు చేసుకోవాలని పిటిషనర్లకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. గిరిజన రిజర్వేషన్ల పెంపు జీవో చట్టబద్ధం కాదని, దాని వల్ల ఆదివాసీలకు నష్టపోతారని, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న జీవోను కొట్టివేయాలని సుప్రీంకోర్టులో ఆదివాసీ సంఘాల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
కొత్త జీవోతో రిజర్వేషన్లు 50 శాతం దాటుతాయని, ఇది రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ఉల్లంఘించడమే అని గిరిజన సంఘాలు పిటిషన్లో పేర్కొన్నాయి. అంతేకాకుండా, చెల్లప్ప కమిషన్ 9 శాతం వరకే రిజర్వేషన్లు పెంచుకోవాలని సూచించిందన్న ఆదివాసీ సంఘాలు.. అందుకు సంబంధించిన బిల్లు పార్లమెంటులో పెండింగ్‌లో ఉండగా జీఓ తీసుకురావడం చట్ట ప్రకారం చెల్లదని తెలిపాయి. తెలంగాణ జీవోతో సుగాలి, లంబాడా, బంజారాలకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని వాదనలు వినిపించింది. ఈ విషయంపై రాష్ట్ర హైకోర్టులోనే జీవోను సవాల్ చేయాలని సూచిస్తూ.. ధర్మాసనం విచారణ ముగించింది.