- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీడీపీవో, ఈవో ఎగ్జామ్స్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్‌పీఎస్సీ సీడీపీవో, గ్రేడ్-1 సూపర్ వైజర్ పరీక్షలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ రెండు ఎగ్జామ్స్‌ను క్యాన్సిల్ చేయాలని కోరుతూ 76 మంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు విచారణ నేపథ్యంలో వాదనల కోసం పిటిషనర్లు సమయం కోరారు. సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ రేపు (మంగళవారం) వాదనలు వినిపిస్తారని పిటిషనర్లు తెలిపారు. దీంతో న్యాయస్థానం తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.
కాగా, ప్రశ్నపత్రాల లీకేజీతో ఇటీవల జరిగిన గ్రూప్-1 పరీక్షతో పాటు ఇతర నియామక పరీక్షలను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీడీపీవో, ఈవో పరీక్షల నిర్వహణపైనా సందేహాలు ఉన్నాయని, వాటిని కూడా రద్దు చేయాలని 76 మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. జనవరిలో సీడీపీవో, గ్రేడ్-1 సూపర్‌వైజర్ నియామక పరీక్షలు నిర్వహించిందని, తాము వేసిన పిటిషన్‌పై తీర్పు వచ్చే వరకు నియామక ప్రక్రియను నిలిపేసేలా స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరారు.
ఇవి కూడా చదవండి: