- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Health: ఆందోల్ అభివృద్ధిపై మంత్రి దామోదర్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ

దిశ, వెబ్ డెస్క్: ఆందోల్- జోగిపేట మున్సిపాలిటీ (Andol-Jogipet Municipality) అభివృద్ధిపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Health Minister Damodar Rajanarsimha) సమీక్ష (review) నిర్వహించారు. ఆందోల్ ఈ సందర్భంగా ఆయన.. అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలో ఆందోల్- జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నా ఆందోల్ పట్టణానికి (Andol town) తలమానికంగా నిలిచిన ట్యాంక్ బండ్ (Tank Bund)ను పర్యాటకుల కోసం ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని పర్యాటక శాఖ (Tourism Department) అధికారులను (Officials) ఆదేశించారు.
అలాగే ఆందోల్ ట్యాంక్ బండ్ లో పర్యాటకుల కోసం బోటింగ్ (boating) సౌకర్యం, రెస్టారెంట్ (Restaurant) ఏర్పాటు, ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్, వాకింగ్ ట్రాక్ (Wailking Track) నిర్మాణంపై చర్చించారు. అనంతరం పట్టణంలో నిర్మిస్తున్న ఆధునిక లైబ్రరీ (Library), మున్సిపల్ ఆఫీస్ (Minicipal Office) పనుల పురోగతిపై చర్చ జరిపారు. అంతేగాక ఆందోల్- జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గాంధీ పార్క్ (Gandhi Park) ఆధునీకరణ పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలో ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో వాలీబాల్, ఫుట్ బాల్, క్రికెట్ గ్రౌండ్ లలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మల్టీ పర్పస్ స్టేజ్ ను నిర్మించాలని సూచించారు.
ఇక తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (Telangana Urban Finance Infrastructure Development Corporation) (TUFIDC) 30 కోట్ల 20 లక్షల రూపాయల నిధులతో చేపడుతున్న 34 పనుల పురోగతిపై ప్రజారోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. మున్సిపాలిటీలో చేపడుతున్న పనులను వెంటనే పూర్తి చేయాలని మంత్రి చెప్పారు. ఈ పర్యటనలో ఆందోల్ లో నిర్మించనున్న ప్రతిపాదిత ఎం ఫార్మసీ కళాశాల, ఇతర విద్యాసంస్థల ఏర్పాటుకు స్థల పరిశీలనను స్థానిక ఆర్డీఓ, రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల ఏర్పాటుకు అవసరమైన ల్యాండ్ బ్యాంకును సమకూర్చాలని రెవిన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు.