- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
BREAKING: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

X
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో కవిత అరెస్ట్‌పై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ రాజకీయ కుట్ర అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. అక్రమ అరెస్ట్‌లు, వేధింపులు మాకు కొత్తేమి కాదని అన్నారు. శుక్రవారం కోర్టు సమయం ముగిశాక ఒక పథకం ప్రకారం అరెస్ట్ చేశారని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరించారు. కవిత అక్రమ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. కవిత అరెస్ట్‌పై న్యాయపరంగా పోరాడుతామని తేల్చి చెప్పారు.
Next Story