- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చెప్పేది ఒకటి, చేసేది ఒకటి.. రుణమాఫీ మార్గదర్శకాలపై హరీష్ రావు ఫస్ట్ రియాక్షన్ ఇదే
దిశ, డైనమిక్ బ్యూరో: రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతల పైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టం అని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. పంట రుణమాఫీ మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేసిన క్రమంలో సోమవారం ట్విట్టర్ వేదికగా హరీష్‌రావు స్పందించారు. ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట.. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకి అలవాటుగా మారిందన్నారు.
డిసెంబర్ 12, 2018 వరకు ముందున్న రైతులకు వర్తించదు అనే నిబంధన అసమంజసం అని పేర్కొన్నారు. రైతుకు రుణ భారం తగ్గించే ప్రయత్నం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనపడుతున్నదని విమర్శించారు. ఆహార భద్రత కార్డు, పీఎం కిసాన్ పథకం ప్రామాణికం అని ప్రకటించడం అంటే లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమేనని అన్నారు. ఎన్నికలప్పుడు మభ్య పెట్టారని, అధికారం చేజిక్కినాంక ఆంక్షలు పెట్టారని ఆసక్తికర ట్వీట్ చేశారు.