- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోలుకున్నాక KCR మొదటగా వెళ్లేది అక్కడకే.. హరీష్ రావు క్లారిటీ
దిశ, వెబ్‌డెస్క్: ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతేడాది డిసెంబర్ 9వ తేదీనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మాటిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రుణమాఫీ ప్రస్తావనే తీసుకురావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. రైతుబంధు, నిరుద్యోగ భృతి, రూ.4 వేల పెన్షన్, ఉచిత విద్యుత్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలు ఇచ్చి కాలం వెళ్లదీస్తోందని మండిపడ్డారు.
రైతులకు భరోసా ఇచ్చి సాగు విస్తీర్ణం పెంచేలా చూడాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఐటీ మంత్రిగా పెట్టుబడుల కోసం కేటీఆర్ దావోస్‌కు వెళ్తే.. డబ్బులు దండగా అని మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడెందుకు వెళ్లారని ప్రశ్నించారు. అదానీ వెనుక ప్రధాని మోడీ ఉన్నారని స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అన్నారని.. అలాంటి అదానీని రేవంత్ రెడ్డి ఎలా కౌగిలించుకున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడుతోందని.. 15 రోజుల్లో గజ్వేల్‌కు వస్తారని హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు.