Harish Rao : దమ్ముంటే సిద్దిపేటకు రండి : హరీష్ రావు సవాల్

by M.Rajitha |
Harish Rao : దమ్ముంటే సిద్దిపేటకు రండి : హరీష్ రావు సవాల్
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు సవాల్(Harish Rao Challenge) విసిరారు. గాంధీ భవన్లో(Gandhi Bhavan) కూర్చొని కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)పై నోటికి వచ్చినట్టు మాట్లాడటం కాదని, దమ్ముంటే సిద్దిపేటకు వచ్చి కాళేశ్వరం జలాలతో పారుతున్న పంటలు చూడాలని ఛాలెంజ్ చేశారు. 'కొంతమంది మూర్ఖులు గాంధీభవన్‌లో కూర్చొని కాళేశ్వరం కూలిపోయింది, పేలిపోయిందని మాట్లాడుతున్నారు. మూర్ఖులారా ఒక్కసారి సిద్దిపేటకి రండి. గలగలపారుతున్న గోదావరి జలాలు చూసి కళ్లు తెరవండి. కాళేశ్వరంతో సిద్దిపేటలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది'. అంటూ హరీష్‌ రావు వెల్లడించారు.

అయితే ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ(PM Narendra Modi)తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బుధ‌వారం మోడీ అధికారిక నివాసంలో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌ను ముఖ్యమంత్రి ప్రధాన‌మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) విషయంలో నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కమీషన్ల కోసమే నిర్మించారు. ఆ ప్రాజెక్టుతో పని లేకుండానే ఈ ఏడాది 1.56 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి రావడమే ఇందుకు నిదర్శనం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడు కేవలం 50 వేల ఎకరాలకు మాత్రమే నీరు అందిందన్నారు. అలాంటపుడు లక్షల కోట్లు ఖర్చుపెట్టి ఎందుకు నిర్మించారని బీఆర్ఎస్(BRS) ను ప్రశ్నించారు.

Advertisement
Next Story

Most Viewed