Harish Rao: మహారాష్ట్రలో బీఆర్ఎస్ పోటీపై హరీష్ రావు ప్రకటన

by Gantepaka Srikanth |
Harish Rao: మహారాష్ట్రలో బీఆర్ఎస్ పోటీపై హరీష్ రావు ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలంగాణలో చేసిన మోసాలు చాలవు అన్నట్లు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లి మరీ అబద్దాలు ప్రచారం చెబుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అన్నారు. బాండ్ పేపర్లు రాసి ప్రజలను మోసం చేస్తున్నారు. ఇక్కడ చేసిన మోసాలు చాలవన్నట్లు మహారాష్ట్రకు వెళ్లి రేవంత్ రెడ్డి కోతలు కోస్తున్నారని మండిపడ్డారు.

మహిళలకు ప్రతి నెల 2,500 ఇస్తామని ఇచ్చారా? అని అడిగారు. రైతు రుణమాఫీ(Runa Mafi) డిసెంబర్ 9, ఆగస్టు 15 లోగా చేస్తామని మాట తప్పామని రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని ఏఐసీసీ(AICC) ట్విట్టర్‌లో పెట్టారని ఎద్దేవా చేశారు. రుణమాఫీ విషయంలో రైతులకు వడ్డీ భారం పడిందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 11 నెలల్లో కేవలం 20 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయిందని చెప్పారు. వరి పంటకు 500 బోనస్ ఇస్తున్నామని రేవంత్ రెడ్డి(Revanth Reddy) మహారాష్ట్రలో చెప్పారు. ముందు ఇప్పటికే హామీ ఇచ్చిన తెలంగాణ రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇళ్ళు కూలగొట్టడాలు తప్ప.. ఒక్క ఇళ్లు పేదలకు ఇవ్వలేదని మండిపడ్డారు.

ఇందిరమ్మ రాజ్యం వస్తే సంవత్సరంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని గుర్తుచేశారు. ఉద్యోగాలు అడిగితే అశోక్ నగర్‌లో నిరుద్యోగులపై లాఠీ ఛార్జ్ చేసిన గొప్ప ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గెలిచాక గ్యారంటీలన్నీ గ్యారేజ్‌కు వెళ్లాయని విమర్శించారు. మహారాష్ట్రకు డబ్బులు పంపించడంపై ఉన్న శ్రద్ధ.. రేవంత్ రెడ్డికి తెలంగాణపై లేదని అన్నారు. తెలంగాణలో అక్రమంగా సంపాదించిన డబ్బు మహారాష్ట్రకు తరలిస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదు. మహారాష్ట్ర ఎన్నికల్లో మాకు గ్రౌండ్ లేదని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed