Harish Rao: "యథా రాజా తథా పోలీసులు".. మాజీమంత్రి హాట్ కామెంట్స్

by Ramesh Goud |
Harish Rao: యథా రాజా తథా పోలీసులు.. మాజీమంత్రి హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో పరిస్థితి యథా రాజా తథా పోలీసులు అన్నట్టుందని, కొందరు పోలీసు అధికారుల తీరు వల్ల తెలంగాణ పోలీస్ బ్రాండ్ కు అవినీతి మకిలి పట్టిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. "వచ్చిరాగానే వసూళ్లు, వివాదాస్పదమవుతున్న పలువురు యువ ఐపీఎస్ ల తీరు" అని ఓ దిన పత్రికలో వచ్చిన కథనాన్ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. యువ అఖిలభారత సర్వీస్ అధికారులకు ప్రభుత్వాలు ఆదర్శంగా ఉండి, వాళ్లకి పని పట్ల నిబద్ధత, ప్రజా సేవ పట్ల అంకితభావాన్ని నేర్పించాలని అన్నారు.

కానీ రాష్ట్రంలో పరిస్థితి “యథా రాజా తథా పోలీసులు” అన్నట్టు తయారయ్యిందని విమర్శలు చేశారు. ఇక కేసీఆర్ ఆలోచనలతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగాన్ని గత పదేళ్ల కాలంలో దేశంలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దామని తెలిపారు. ఆ ప్రక్రియలో ఎందరో తెలంగాణ సీనియర్ ఐపీఎస్ పోలీస్ అధికారుల అనుభవంతో కూడిన పాత్ర ఖచ్చితంగా ఉందని చెప్పుకొచ్చారు. అలాగే అలాంటి తెలంగాణ రాష్ట్ర పోలీస్ బ్రాండ్‌కు కొందరి తీరు వల్ల అవినీతి మకిలి పడితే పోలీస్ అధికారులు పడ్డ కష్టం వృథా అవుతుందని అన్నారు. ఒక్కసారి ఈ విషయాన్ని తెలంగాణ సీనియర్ పోలీస్ అధికారులు పునరాలోచించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని హరీష్ రావు సూచించారు.

Next Story

Most Viewed