Harish Rao: ఆ సిబ్బందికి జీతాలేవి..? ఈ ఘనత కాంగ్రెస్ కే దక్కుతుంది

by Ramesh Goud |
Harish Rao: ఆ సిబ్బందికి జీతాలేవి..? ఈ ఘనత కాంగ్రెస్ కే దక్కుతుంది
X

దిశ, వెబ్ డెస్క్: ఆసుపత్రి సిబ్బందికి జీతాలేవి? అని, ఈ చిరు ఉద్యోగుల ఆవేదన రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా? అని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish rao) అన్నారు. బుధవారం నాంపల్లి ఏరియా ఆసుపత్రి (Nampally Area Hospital) సహా పలు ఆసుపత్రులలోని చిరు ఉద్యోగులు.. మూడు నెలలుగా జీతాలు (Salaries) చెల్లించలేదని నిరసన (Protest) వ్యక్తం చేశారు. తెలంగాణ మెడికల్ యూనియన్ (Telangana Medical Union) ఆధ్వర్యంలో ఆసుపత్రుల బయట నిలబడి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం మొండి వైఖరి వీడి, ఆసుపత్రులలోని చిరు ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించేందుకు కృషి చేయాలని డిమాండ్ (Demand) చేశారు.

ఈ నిరసనలకు సంబంధించిన వీడియోలను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన హరీష్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీవీవీపీ (TVVP) ఆస్పత్రుల శానిటేషన్ (Sanitation), పేషంట్ కేర్ (Patient Care), సెక్యూరిటీ సిబ్బంది (Sequerity Staff)కి మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం శోచనీయమని అన్నారు. అలాగే రోగులకు సేవలు అందించడంలో ఎంతో ముఖ్యపాత్ర పోషించే ఫ్రంట్ లైన్ వర్కర్ల (Front Line Workers)ను వేతనాలు ఇవ్వక నడిరోడ్డు మీదకు తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ (Congress party)కే దక్కిందని విమర్శలు చేశారు. అంతేగాక నెల జీతం మీదనే పిల్లల చదువులు, ఇంటి కిరాయిలు చెల్లించే కార్మికులు.. జీతాలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

టెండర్ ప్రకారం జీతాలు ఇవ్వకుండా, పీఎఫ్ డబ్బులు జమ చేయకుండా కాంట్రాక్టర్లు వ్యవహరిస్తుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఫ్రంట్ లైన్ కార్మికులకు ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వంలో కదలిక లేకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి ఈ చిరు ఉద్యోగుల ఆవేదన కనిపించడం లేదా? అని నిలదీశారు. ఇక పెండింగ్ వేతనాలు (Pending Salaries) వెంటనే చెల్లించాలని, ప్రతినెల సకాలంలో జీతాలు ఇవ్వాలని, కాంట్రాక్టర్లు వేతనాల్లో కోత పెట్టకుండా నివారించాలని బీఆర్ఎస్ (BRS) పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని సిద్దిపేట ఎమ్మెల్యే (Siddipeta MLA) రాసుకొచ్చారు.

Next Story